34 గ్రామాల్లో 3 వేల ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ : ట్రాన్స్‌‌‌‌కో సీఎండీ జితేష్ వి.పాటిల్

34 గ్రామాల్లో 3 వేల ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ : ట్రాన్స్‌‌‌‌కో సీఎండీ జితేష్ వి.పాటిల్

కొడంగల్, వెలుగు : కొడంగల్‌‌‌‌ను మోడల్ సోలార్ మండలంగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేస్తున్న రూఫ్‌‌‌‌టాప్ సోలార్ యూనిట్లను సోమవారం ట్రాన్స్​కో సీఎండీ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు కొడంగల్ నియోజకవర్గంలోని 34 గ్రామాల్లో సుమారు 3 వేల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

త్వరలో మిగిలిన గ్రామాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు. వినియోగదారులు అవసరానికి సరిపడా విద్యుత్ వినియోగించిన తర్వాత మిగిలిన విద్యుత్‌‌‌‌ను అమ్మి  అదనపు ఆదాయం పొందొచ్చన్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, ట్రాన్స్​కో సీఈ బాలస్వామి, ఎస్‌‌‌‌ఈ రవిప్రసాద్  పాల్గొన్నారు.